Kukunoorpally: కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ రేష్మి పెరుమాళ్!

Kukunoorpally: సిద్దిపేట పోలీస్ కమిషనర్ రేష్మి పెరుమాళ్ మంగళవారం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

Osman Pathan, GAJEWL
Published on: 24 Nov 2026 9:01 PM IST
Kukunoorpally
X

Kukunoorpally: కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ రేష్మి పెరుమాళ్!

కుకునూరుపల్లి: సిద్దిపేట పోలీస్ కమిషనర్ రేష్మి పెరుమాళ్ మంగళవారం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరిశీలించి, విధుల నిర్వహణ, స్టేషన్ నిర్వహణ, శాంతిభద్రతల పరిస్థితిపై పోలీస్ అధికారులతో సమీక్షించారు.

అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో జరిగే సంఘటనలపై నిరంతరం నిఘా ఉంచాలని, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.

ఈ సందర్భంగా కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ పుష్పగుచ్ఛం అందించి సీపీకి స్వాగతం పలికారు. ఈ తనిఖీలో తొగుట సీఐ శ్రీనివాస్, ఎస్సై బాలకృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL