Siddipet: భైరాన్‌పల్లిలో సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్!

Siddipet: సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం భైరాన్‌పల్లిలో 'సురక్ష నేత్ర' ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రారంభించారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 11 Nov 2026 4:13 PM IST
Siddipet
X

Siddipet: భైరాన్‌పల్లిలో సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్!

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం, భైరాన్‌పల్లిలో సీసీ కెమెరాలు ప్రారంభం. గ్రామాల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం భైరాన్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

గ్రామంలోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడంతో పాటు నేరాల దర్యాప్తులో కూడా ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజలు, గ్రామస్థులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. గ్రామ భద్రత కోసం ముందుకొచ్చిన గ్రామస్థులను సీపీ గారు అభినందించారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL