Siddipet: సిద్దిపేట గడ్డపై హరీష్ రావు అవినీతిని ఎండగట్టనున్న సీఎం!
Siddipet: సిద్దిపేట గడ్డపై హరీష్ రావు అవినీతిని సీఎం రేవంత్ రెడ్డి ఎండగడతారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు. కేటీఆర్, హరీష్ రావుల తీరుపై తీవ్ర ఆగ్రహం.
Siddipet: సిద్దిపేట గడ్డపై హరీష్ రావు అవినీతిని ఎండగట్టనున్న సీఎం!
Siddipet: సిద్దిపేట గడ్డ మీద నుండి హరీష్ రావు అవినీతిని తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతుండు, హరీష్ రావు పార్టీ ఎజెండా కాకుండా సొంత ఎజెండా తో తిరుగుతుండు, మామా కేసీఆర్ 6నెలల నుండి హరీష్ రావు కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు, బావా బామ్మర్ది ఆధిపత్యం కోసం రైతు గర్జన పేరుతో దొంగల్లాగా తిరుగుతున్నారు, హరీష్ రావు,కేటీఆర్ ఓట్లో రక్తం ఉండదు కేవేలం విషం మాత్రమే ఉంది.
కాళేశ్వరం పై హరీష్ రావు పుండా కోరు మాటలు మాట్లాడుతున్నారు, మరొక సారి రైతులను మోసం చేయడానికి బావ బామ్మర్దులు తిరుగుతున్నారు, రైతుల కండ్లలో రక్తం చూసిన దుర్మార్గులు ఇప్పుడు రైతు వేషం వేసుకొని తిరుగుతున్నారు, మీ అవినీతి ని కప్పి పుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పై అవినీతి ని అంటగాడుతున్నారు.
తెలంగాణ లో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరును కేటీఆర్ చూపించగలడా? తెలంగాణ భవన్ లో త్వరలో హరీష్ రావు మైక్ కట్ కాబోతుంది, తెలంగాణ లో హరీష్ రావు ఆటలు చెల్లవ్.
ఇక నుండి బావ బామ్మర్దుల ఆటలు సాగవు, తెలంగాణ ఉద్యమ కారులు చనిపోతే కేటీఆర్ చెన్నై పోయిండు, ఉద్యమకారులను అక్కున చేర్చుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పట్టబద్రుల ఎన్నికల్లో Brs, బీజేపీ అవయవ దానం చేసుకోబోతున్నారు, Brs నాయకుల అవినీతిని బీజేపీ కాపాడుతుంది, బీజేపీ, Brs దొంగల పంచన చేరింది.
తెలంగాణ ప్రజలు ప్రతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కి పట్టం కట్టారు,పట్టబద్రుల ఎన్నికల్లో కూడా, కాంగ్రెస్ కు పట్టం కడతారు,మహిళ లు,రైతుల పక్షాన నిలబడేది కేవలం కాంగ్రెస్ మాత్రమే, ఇప్పటికైనా కేటీఆర్ ,హరీష్ రావు డ్రామాలు ఆపాలని హెచ్చరిస్తున్న.




