Siddipet: సిద్దిపేటలో బతుకమ్మ చీరల పంపిణీ: మెరుగు రాజు
Siddipet: సిద్దిపేట లింగారెడ్డిపల్లిలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మెరుగు రాజు.. సీఎం రేవంత్ పాలనను కొనియాడారు.
Siddipet: సిద్దిపేటలో బతుకమ్మ చీరల పంపిణీ: మెరుగు రాజు
సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు లింగారెడ్డి పల్లి లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నరూ. ఈ సందర్భంగా మెరుగు రాజు మాట్లాడుతూ, మహిళలకు p కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అంతేకాకుండా
సిరిసిల్ల చేనేత కార్మికులకు ఏడాది పాటు పని కల్పించడం, పేద మహిళలకు బతుకమ్మ పండుగ చీరలు అందించదు గొప్ప కార్యక్రమం అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.బతుకమ్మ చీర కేవలం ఒక వస్త్రం కాదు అని అది తెలంగాణ ఆడబిడ్డకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమని అదే సమయంలో తెలంగాణ నేతన్నకు బతుకు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని పేర్కొన్నారు.అప్పటి
బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో రేషన్ కార్డులు అందించిన పాపాన పోలేదు .పేద ప్రజలను బిఆరెస్ నిర్లక్ష్యం చేసిందనీ మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషి వల్లే ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. దేశంలో సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనీ తెలిపారు.
అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు పద్మ ,భాగ్య,1వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటగిరి రాజు, పిన్నింటీ రాజిరెడ్డి, చెప్యాల శేఖర్, మెరుగు హరిక్రిష్ణ, పోతుల మల్లేశం వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.




