Siddipet: సిద్ధిపేటలో బీఆర్ఎస్, టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఫైర్

Siddipet: సిద్ధిపేటలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీలు టూడుదొంగలని, మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.

RAJU, SIDDIPET
Published on: 14 Nov 2026 7:05 PM IST
Siddipet
X

Siddipet: సిద్ధిపేటలో బీఆర్ఎస్, టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఫైర్

సిద్ధిపేట: బిఆరెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీలు తోడుదొంగలు అని అధికారం పోయి ఒకరు అధికారంలోకి రావాలి అని గుంటనక్కలు లాగా ఎదురు చూస్తున్నారు అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు. సిద్ధిపేట లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ బిఆరెస్ నుంచి బయటకు వచ్చిన కవిత ప్రజల దృష్టిని మరలిచేందుకు టిఆర్ఎస్ పార్టీ పెట్టారు అని అన్నారు.

మళ్లీ కెసిఆర్ ను అధికారంలోకి తెచ్చేందుకు బీజేపీ బిఆరెస్ కవిత పార్టీలు కుట్రలు చేస్తున్నారు అని అన్నారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు అని అన్నారు. బయటకు ఒకరికి ఒకరు తిట్టుకున్న వారిది కల్వకుంట్ల కుటుంబమే అని ఎద్దేవా చేశారు. బిఆరెస్ పోయి టిఆర్ఎస్ వచ్చిన తెలంగాణ కోసం చేసి ఏమీ లేదు అని వాళ్ళిద్దరూ కలిసి అధికారం చేయాలని చూస్తూ ఉన్నారు అని అన్నారు.

10 సంవత్సరాలు కెసిఆర్ కుటుంబం లక్షల కోట్లు రూపాయలు దోచుకున్నది సరిపోక మళ్లీ దోచుకోవాలి అని చూస్తూ ఉన్నారు అని మండిపడ్డారు. 10 సంవత్సరాలు కెసిఆర్ చేర నుంచి విడిపించి కాంగ్రెస్ ప్రభుత్వంకు ప్రజలు పట్టం కట్టారు అని కానీ కెసిఆర్ కుటుంబం మళ్లీ ప్రజలను మోసం చేయాలి అని చూస్తున్నారు అని వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు అని అన్నారు.

కవిత సిద్దిపేట పేరుతో దోచుకుంది తప్ప ఆమె చేసింది ఏమీ లేదు అని మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తాం అని పగటి కలలు కనవద్దు అని అన్నారు. బిఆరెస్ టిఆర్ఎస్ కు మునిసిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవనివ్వ వద్దు అని రాబోయే సిద్ధిపేట మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించాలి అని అన్నారు.

వచ్చే మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే అన్నీ వార్డులు అభివృద్ధి చేస్తాం అని అన్నారు. ఈనెల 29న సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి గారి సభకు ప్రజలు వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు స్వచందంగా తరలివచ్చి కార్యక్రమంను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు గయాజుద్దీన్ ఫయాజ్ నవాజ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET