Siddipet: కొండపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

Siddipet: సిద్దిపేట జిల్లా కొండపాక పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కె. హైమావతి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశం.

RAJU, SIDDIPET
Published on: 20 Sept 2026 11:10 PM IST
Siddipet
X

Siddipet: కొండపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

సిద్దిపేట: కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్

అటెండెన్స్ రిజిస్టర్, ఓపి రిజిస్టర్ తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు సమయ వేళలు పాటిస్తున్నారా అని ఆరా తీశారు.

ఆసుపత్రి రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బంది ఆదేశించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి మలేరియా, డెంగ్యూ కేసులు వివరాలను ఏఎన్ఎం, సూపర్ వైజర్లతో ఎల్లపుడు తెలుసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. అలాగే మెడిసిన్, వివిధ సామాగ్రిని ఆసుపత్రిలో ఎక్కువ మొత్తంలో ఉంచుకోవాలని ఆదేశించారు.

ప్రతివారం నిర్వహించే శానిటేషన్ డ్రైవ్ లో తప్పనిసరిగా పాల్గొని ప్రజలకు సీజనల్ వ్యాధులకు గురికాకుండా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET