Cheryala: చేర్యాల పట్టణంలో వీధి కుక్కల గుంపులతో ప్రజల బెంబేలు!
Cheryala: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో వీధి కుక్కలు, పందులు, కోతుల బెడద తీవ్రమైంది. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నామని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Cheryala: చేర్యాల పట్టణంలో వీధి కుక్కల గుంపులతో ప్రజల బెంబేలు!
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో వీధి కుక్కలు, పందులు, కోతుల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. పట్టణంలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు పందులు రోడ్లపై స్వైరవిహారం చేస్తుండగా, కోతుల బెడద కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.
చిన్నపిల్లలు, వృద్ధులు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు మొరపెట్టుకున్నా సంబంధిత మున్సిపల్ అధికారుల్లో కనీస స్పందన లేదని ప్రజలు మండిపడుతున్నారు.




