Cheryala: పండుగ ముగిసినా మహిళలకు అందని చీరలు.. అధికారుల నిర్లక్ష్యం!

Cheryala: సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఇందిరమ్మ చీరలు పంపిణీకి నోచుకోక మూలుగుతున్నాయి. పండుగ, ఇందిరాగాంధీ జయంతి ముగిసినా చీరలు అందక మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 25 Nov 2026 9:37 AM IST
Cheryala
X

Cheryala: పండుగ ముగిసినా మహిళలకు అందని చీరలు.. అధికారుల నిర్లక్ష్యం!

చేర్యాల: మద్దూర్ మండలం పండుగను పురస్కరించుకుని మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలు అధికారుల నిర్లక్ష్యంతో మహిళా సమాఖ్య కార్యాలయంలోనే మూలుగుతున్నాయి. పండుగకు ముందే చేరుకున్న చీరలను మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం ముగిసినప్పటికీ చీరల పంపిణీపై ఎలాంటి కదలిక లేకపోవడం గమనార్హం. పండుగ సమయంలో అందుతాయని ఆశించిన మహిళలకు ఇప్పటికీ చీరలు అందకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం మహిళల కోసం అందించిన చీరలు కార్యాలయాలకే పరిమితం కావడంపై మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఇందిరమ్మ చీరలను మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయాలని మహిళలు కోరుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL