Cheryala: కొమురవెల్లి మల్లన్న గుట్టపై డ్రోన్ కెమెరా కలకలం!
Cheryala: సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న గుట్టపై ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్ కెమెరా ఎగురవేయడం స్థానికంగా కలకలం రేపింది.
Cheryala: కొమురవెల్లి మల్లన్న గుట్టపై డ్రోన్ కెమెరా కలకలం!
చేర్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ గుట్టపై ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్ కెమెరా ఎగురవేయడం స్థానికంగా కలకలం రేపింది. ఆలయ గుట్టపై డ్రోన్ కెమెరా ఎగురుతున్నట్లు సమాచారం అందుకున్న కొమురవెల్లి పోలీసులు వెంటనే స్పందించి డ్రోన్ ఎగురవేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అసలు డ్రోన్ కెమెరా ఎగురవేసింది ఎవరు? ఏ ఉద్దేశంతో ఆలయ గుట్టపై డ్రోన్‌ను ఎగురవేశారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కొమురవెల్లి ఎస్ఐ మహేష్ తెలిపారు.




