Cheryala: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై వేచరేణి రైతుల రాస్తారోకో!
Cheryala: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంట క్రాస్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ వేచరేణి గ్రామ రైతులు సిద్దిపేట–జనగామ రహదారిపై రాస్తారోకో చేశారు.
Cheryala: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై వేచరేణి రైతుల రాస్తారోకో!
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంట క్రాస్ రోడ్ వద్ద సిద్దిపేట–జనగామ ప్రధాన రహదారిపై వేచరేణి గ్రామ రైతులు రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా తమ ధాన్యాన్ని పట్టించుకునే వారు లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు చేపడతామని రైతులు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న చేర్యాల తహసీల్దార్ వెంటనే అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు.
ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ హామీతో రైతులు ఆందోళన విరమించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.




