Cheryala: చేర్యాల అంబేద్కర్ నగర్ రోడ్డు వెడల్పు పనులు వెంటనే చేపట్టాలి!
Cheryala: చేర్యాల అంబేద్కర్ నగర్ రోడ్డు వెడల్పు పనులు వెంటనే చేపట్టి, ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని అఖిలపక్షం ధర్నా చేసింది.
Cheryala: చేర్యాల అంబేద్కర్ నగర్ రోడ్డు వెడల్పు పనులు వెంటనే చేపట్టాలి!
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ నగర్లో రోడ్డు వెడల్పు పనులను వెంటనే ప్రారంభించాలని, రోడ్డు విస్తరణలో ఇళ్లు కోలిపోయి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఎమ్మార్పీఎస్ టీఎస్, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కోల్పోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.ఇళ్లు కోల్పోయిన బాధితులను నిరాశ్రయులుగా వదిలేయకుండా,వారికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, ఇందిరమ్మ గృహాలను ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను అధికారులు సమావేశపరిచి వారి డిమాండ్లను తెలుసుకొని రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించాలని వారు కోరారు.
ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు రామగళ్ళనరేష్ అందె బీరయ్య మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, ఎమ్మార్పీఎస్ టీఎస్, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు, చుంచు అశోక్ గజ్జల సురేందర్ మల్లిగారి వినయ్ కుమార్ భూమిగారి బిక్షపతి ఇరుగు మధు నల్ల నవీన్ కుమార్ మల్లయ్య రామగళ్ళ లక్ష్మి మరియు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




