Toguta: అగ్నిప్రమాద బాధితులకు చెరుకు కొండల్ రెడ్డి పరామర్శ
Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో అగ్నిప్రమాద బాధితుడు చిక్కుడు నారాయణ కుటుంబానికి చెరుకు కొండల్ రెడ్డి సాయం అందించారు.
Toguta: అగ్నిప్రమాద బాధితులకు చెరుకు కొండల్ రెడ్డి పరామర్శ
తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో అగ్నిప్రమాదంతో ఇల్లు కోల్పోయిన నిరుపేద చిక్కుడు నారాయణ కుటుంబానికి 50 కేజీల బియ్యం, దుప్పట్లు అందించి,భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా కల్పించిన దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ శ్రీ చెరుకు కొండల్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో బోయిని లక్ష్మణ్ ముదిరాజ్, వంగ కనకయ్య యాదవ్, భరేంకల యాదయ్య ముదిరాజ్, భరేంకల స్వామి ముదిరాజ్, గొడుగు శ్రీను ముదిరాజ్, చిక్కుడు రమేష్ (ఈశ్వర్) ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




