Cheriyal: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: చైర్మన్ ప్రశాంత్ రెడ్డి!

Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించి, రైతులకు మద్దతు ధర దక్కుతుందని తెలిపారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 4 Nov 2026 6:44 PM IST
Cheriyal
X

Cheriyal: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: చైర్మన్ ప్రశాంత్ రెడ్డి!

చేర్యాల: చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో రైతుల సౌకర్యార్థం పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. చేర్యాల మార్కెట్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL