Siddipet: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ: అడిషనల్ డీసీపీ కుశాల్కర్!

Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గులో ‘సురక్ష నేత్ర’ సీసీ కెమెరాలు ప్రారంభం. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమని అడిషనల్ డీసీపీ కుశాల్కర్ వెల్లడి.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 19 Sept 2026 10:14 PM IST
Siddipet
X

Siddipet: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ: అడిషనల్ డీసీపీ కుశాల్కర్!

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సురక్ష నేత్ర లో భాగంగా ఈ రోజు కడవేర్గు గ్రామం లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. డీసీపీ మాట్లాడుతు ప్రతి గ్రామం లో సీసీ కెమెరాల ఏర్పాటు కు ప్రతి ఒక్కరు భాద్యతగా ముందుకు రావాలని ప్రధాని కూడళ్ళ ముఖ్యమైన ప్రదేశాలాలో సీసీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఏదైనా నేరం లేదా అసాంఘిక కార్యక్రమాలు జరిగిన వ నేరస్తులను పట్టుకోవడానికి సిసి కెమెరాలు ఎంతో తోడ్పడతాయని డీసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమేష్ గుప్త చేర్యాల CI రమేష్ నాయక్ SI అపూర్వ రెడ్డి స్థానికులు పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL