Cherial: చేర్యాలలో ప్రజావాణికి అధికారుల డుమ్మా: ప్రజల తీవ్ర నిరాశ!

Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాలలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సంబంధిత అధికారులు గైర్హాజరు కావడంతో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 9 Nov 2026 4:34 PM IST
Cherial
X

Cherial: చేర్యాలలో ప్రజావాణికి అధికారుల డుమ్మా: ప్రజల తీవ్ర నిరాశ!

చేర్యాల: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల గైర్హాజరు ప్రజలను నిరాశకు గురిచేసింది. చేర్యాల పట్టణంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తమ సమస్యలను పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు హాజరుకాకపోవడంతో ప్రజలు వెను దిరిగి వెళ్లారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, అధికారులు గైర్హాజరు కావడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతో వచ్చిన ప్రజలకు అధికారుల నిర్లక్ష్యంతో నిరాశే మిగిలిందని వాపోతున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL