Siddipet: కోడిని కారుతో ఢీకొట్టి.. ప్రశ్నించిన యజమానిపై దాడికి యత్నం!

Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో కారు ఢీకొని కోడి మృతి చెందిన ఘటన వివాదానికి దారితీసింది. ప్రశ్నించిన బాధితుడిని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 17 Nov 2026 11:08 AM IST
Siddipet
X

Siddipet: కోడిని కారుతో ఢీకొట్టి.. ప్రశ్నించిన యజమానిపై దాడికి యత్నం!

చేర్యాల: కారు ఢీ కొని కోడి చనిపోయిన పంచాయతీ ఘటన వివాదానికి దారితీసింది. చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన పౌడాల రాములు పెంచుకుంటున్న కోడిని సోమవారం కారు ఢీ కొట్టడంతో కోడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కారు యజమాని మల్లోజు రవికుమార్‌ను బాధితుడు రాములు ప్రశ్నించగా, దురుసుగా సమాధానమిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడని, అంతేకాకుండా తనపై దాడికి ప్రయత్నించాడని బాధితుడు ఆరోపించారు.

నువ్వు ఏం చేసుకుంటావో బెదిరింపులకు పాల్పడ్డాడని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాధితుడు పౌడాల రాములు చేర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కోడిని కారుతో ఢీకొట్టి చంపడమే కాకుండా, న్యాయం అడిగిన తనను బెదిరించడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL