Siddipet: అభివృద్ధి నమూనా సిద్దిపేట అని చూపించిన నేత హరీష్ రావు!
Siddipet: సిద్దిపేట అభివృద్ధి పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వివక్షతో ఆగిన పనులను సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చూసిపోవాలని బీఆర్ఎస్ నేతలు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాం సూచించారు.
Siddipet: అభివృద్ధి నమూనా సిద్దిపేట అని చూపించిన నేత హరీష్ రావు!
సిద్దిపేట: పదేండ్ల హయాంలో సిద్దిపేట అన్ని రకాలుగా వినూత్న కార్యక్రమాలతో అధ్యయన కేంద్రం గా మారింది. సీఎం హోదాలో మీరు, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా సిద్దిపేట అభివృద్ధి పనులను చూసి అదేవిధంగా మీ మూడేండ్లలో ప్రభుత్వ వివక్షతో ఆగిన పనులను చూసి పోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం లు సూచించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడారు .
సీఎం రేవంత్ రెడ్డి దండయాత్ర.. మైనంపల్లి బుల్డోజర్ లాంటి అభ్యంతర వ్యాఖ్యలు సరికాదన్నారు... ప్రేమతో సిద్దిపేట కు రావాలని, పరుష పదాలతో కాదు.సిద్దిపేట ప్రజలు చాలా చైతన్యం ఉన్న వారు.. తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్దిపేట పోరాట పటిమ యావత్తు చూసిందని చెప్పారు..సిద్దిపేట పట్ల కాంగ్రెస్ నాయకులు భాష మార్చుకోవాలన్నారు.. రేవంత్ రెడ్డి దండయాత్ర కాదు. సిద్దిపేట లో ఆగిన పనుల గూర్చి మాట్లాడు... 3 ఏండ్లుగా ఒక్క పని జరగలేదన్నారు... సీఎం హోదాలో రాష్ట్రంలో ఎక్కడైనా వెళ్లే హక్కులు ఉన్నాయి. కానీ ప్రేమతో సిద్దిపేట రా మనసులో అక్కసుతో రావొద్దు. బెదిరింపు ధోరణి సరికాదు...అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం చేసింది.. విద్యుత్ ఛార్జీల ఆదనపు భారం వల్ల ఇందిరమ్మ ఇండ్లలో చీకటి వస్తుంది
ఇది గృహాజ్యోతి లబ్ధిదారుల మీద ప్రభావితం కానుంది... ప్రజలకు జవాబు చెప్పాలి.. సిద్దిపేట ఆత్మ గౌరవం దెబ్బతీసే దండయాత్రలు వద్దు మాకు నిధులు కావాలి... మల్కాజిగిరి లో ఓటమి మైనంపల్లి ప్రేస్టేషన్ లో ఉన్నాడు.. కాంగ్రెస్ పార్టీలో ఐక్యమత్యం లేదని ఆయనే నిన్న ఆవేదన వ్యక్తంచేశారు. బుల్డోజర్ అనేది బిజెపి పదం
-తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించుకున్న వైనం, ఎవరి దయతో రాలేదు...1070 కోట్ల నిధులు మంజూరు చేయాలి... మాజీ మంత్రి హరీష్ రావు మీద రాజకీయ కక్ష్య ఉంటే ప్రజల మీద చూపించవద్దని హితవు పలికారు.ఈ కార్యక్రమం లో ముత్యాల కనకయ్య, పట్టణ మైనార్టీ అధ్యక్షులు అతిక్ అహ్మద్, దరిపల్లి శ్రీనివాస్, రెడ్డి యాదగిరి, శ్రీనివాస్, నవీన్, పెర్క మధు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




