Siddipet: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి విమర్శలు

Siddipet: సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో తొలగించిన పింఛన్లనే కొత్తగా ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని సిద్దిపేట బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి మండిపడ్డారు.

RAJU, SIDDIPET
Published on: 15 Nov 2026 9:45 PM IST
Siddipet
X

Siddipet: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి విమర్శలు

సిద్దిపేట: ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభ నేపద్యంలో సిద్దిపేట బల్దియా అధికారులు ఆఘమేఘాల మీద పింఛన్ల పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని,ఇప్పుడు ఇచ్చే కొత్త పింఛన్లు ఇటీవల రీ వేరిగికేషన్ పేరిట తొలగించి తిరిగి వాటిని కొత్తగా ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం షో చేస్తోందని పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి బిమర్.ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు..

ఇటీవల సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులు రీ వేరిఫికేషన్, వేలిముద్రల పేరిట సర్వే చేసినట్లు వాటిలో చనిపోయిన, అనర్హులుగా ఉన్నారని 850పింఛన్లు తీసివేసినట్టు ఆరోపించారు. వాటిని సీఎం సిద్దిపేట సభ దృష్టిలో పెట్టుకుని కొత్తవారికి ఇస్తున్నట్లు 850మందికి ఆఘమేఘాల మీద ఇస్తున్నారని ఆరోపించారు.

పేద ప్రజలకు అండగా ఉండాలని కేసీఆర్ ఆసరా పథకం అమలు చేసి లక్షలాది పింఛన్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మూడేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఫించన్ ఇవ్వలేదని ఆరోపించారు. సిద్దిపేట లో సీఎం సభ సందర్భంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకం అడుతుందని విమర్శించారు.

అందుకే 850 కొత్త పింఛన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు కేసీఆర్ హయాంలో సిద్దిపేట మున్సిపాలిటీ లో మొత్తము13700 పింఛన్లు ఉన్నాయని, అవే సంఖ్య ఇప్పుడు కూడా ఉందని కాంగ్రెస్ ఇచ్చింది ఒక్క పింఛన్ లేదన్నారు. 36నెలలుగా పింఛన్లు లేవన్నారు.

వృధ్యాప. బీడీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. -ఇప్పటికే సిద్దిపేట పట్టణంలో 1200 దరఖాస్తులు ఆన్లైన్ లో పెండింగ్ లో ఉన్నాయని. ముందు వాటిని మంజూరు చేయాలని కోరారు. కొర్రీలు పెట్టి ప్రభుత్వం అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వకుండా చేస్తుందన్నారు ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు నాగరాజు రెడ్డి, సాయి కుమార్, మోహిజ్, నాయకులు శ్రీనివాస్, ఈర్షద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET