Siddipet: మంత్రి దామోదర రాజనర్సింహకు సర్పంచ్ భాను ప్రసాద్ వినతి!

Siddipet: బొప్పాపూర్‌లో పల్లె దవాఖాన ఏర్పాటు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో మంత్రి దామోదర రాజనర్సింహకు సర్పంచ్ భాను ప్రసాద్ వినతిపత్రం అందజేశారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 3 Nov 2026 6:00 PM IST
Siddipet
X

Siddipet: మంత్రి దామోదర రాజనర్సింహకు సర్పంచ్ భాను ప్రసాద్ వినతి!

సిద్దిపేట: బొప్పాపూర్‌లో పల్లె దవాఖాన ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రికి వినతి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారి ఆదేశాలు, సహకారంతో మంత్రి దామోదర రాజనర్సింహాను కలిసిన సర్పంచ్ భాను ప్రసాద్, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశాలు, సహకారంతో సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ దామోదర రాజనర్సింహా గారిని బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ కలిశారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన పల్లె దవాఖానను బొప్పాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రివర్యులకు వినతిపత్రం అందజేశారు. బొప్పాపూర్ గ్రామంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి రావాలంటే గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటు ఎంతో అవసరమని మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లారు సర్పంచ్ భాను ప్రసాద్ అందించిన వినతిపై మంత్రి దామోదర రాజనర్సింహా గారు సానుకూలంగా స్పందించారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK