Siddipet: సిద్దిపేట న్యాయవాది ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం

Siddipet: సిద్దిపేట జిల్లా న్యాయవాది ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా బోగారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పి. సుధీర్ రెడ్డి ఎన్నిక; ఉద్యోగుల సంక్షేమానికి కృషి.

RAJU, SIDDIPET
Published on: 22 Nov 2026 11:16 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట న్యాయవాది ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా న్యాయవాది ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఆదివారం అధికారికంగా కొలువుదీరింది. ఈ సందర్భంగా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా బోగారి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షురాలిగా ఏ. కరుణశ్రీ, ప్రధాన కార్యదర్శిగా పి. సుధీర్ రెడ్డి, కోశాధికారిగా రాకేష్ దేశపాండే ఎన్నికయ్యారు.

అలాగే ఉపాధ్యక్షులుగా మధుబాబు, ఆర్. పద్మ, డి. రాజు ఎన్నిక కాగా, నిర్వహణ కార్యదర్శిగా పూలసు విఠల్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా పి. సుమలత, జి. శ్రీనివాస్ చారి, లక్ష్మణ్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బోగారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ పదవి ఒక అధికారం కాదని, గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. సంఘంలోని ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాది సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET