Dubbak: జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్‌లో సిద్దిపేట, దుబ్బాక విద్యార్థుల సత్తా!

Dubbak: హైదరాబాద్‌లో జరిగిన 12వ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో సిద్దిపేట, దుబ్బాక విద్యార్థులు 12 పతకాలు సాధించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 23 Nov 2026 5:52 PM IST
Dubbak
X

Dubbak: జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్‌లో సిద్దిపేట, దుబ్బాక విద్యార్థుల సత్తా!

Dubbak: హైదరాబాద్‌లో నవంబర్ 22న నిర్వహించిన 12వ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026 జాతీయ స్థాయి పోటీల్లో సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాలకు చెందిన 12 మంది విద్యార్థులు పాల్గొని 12 పతకాలు సాధించి ప్రతిభ చాటారు. సుమారు 1,000 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో మన విద్యార్థులు నాలుగు గోల్డ్ మెడల్స్, నాలుగు సిల్వర్ మెడల్స్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ సాధించడం విశేషం.

మాస్టర్ మైండ్ స్కూల్, సిద్దిపేటకు చెందిన అనన్య, సుప్రతిక్ గోల్డ్ మెడల్స్ సాధించగా, శ్రీతన్ సిల్వర్ మెడల్, షేరష్ట, అవనేశ్, బాలయోగేందర్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. శ్రీ చైతన్య స్కూల్‌కు చెందిన విశ్రుద్ గోల్డ్ మెడల్, ప్రజ్వలిత్ సిల్వర్ మెడల్ సాధించారు. మెరిడియన్ స్కూల్‌కు చెందిన దివాన్ష్ బ్రాంజ్ మెడల్ సాధించారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK