Siddipet: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో రైతుల సౌకర్యార్థం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
Siddipet: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
సిద్దిపేట: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలనే లక్ష్యంతో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లాలో ని చేర్యాల, కొమురవెల్లి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి, కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామ సర్పంచులు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




