Akkannapet: అక్కన్నపేటను కరువు మండలంగా ప్రకటించాలి: బీఆర్ఎస్!

Akkannapet: సిద్దిపేట జిల్లా అక్కన్నపేటను కరువు మండలంగా ప్రకటించి, ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 2 Nov 2026 8:08 PM IST
Akkannapet
X

Akkannapet: అక్కన్నపేటను కరువు మండలంగా ప్రకటించాలి: బీఆర్ఎస్!

అక్కన్నపేట: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ అక్కన్నపేటలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి సుమారు గంట సేపు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అక్కన్నపేట మండలంలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, పంటలు ఎండిపోతున్నాయని బిఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గూగులోతు రాజు నాయక్ వాపోయారు. అయినప్పటికీ మండలాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి కరువు మండలాల జాబితాలో చేర్చాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

అక్కన్నపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, యాసంగిలో రైతులకు ఎకరానికి 50 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీగా తరలి వెళ్లి తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD