Cheriyal: చేర్యాలలో ఘనంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య 5వ జిల్లా మహాసభలు!

Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ 5వ జిల్లా మహాసభలు.. ప్రభుత్వాల వైఖరిపై మండిపడిన జాతీయ ఉపాధ్యక్షులు పుట్ట లక్ష్మణ్.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 24 Sept 2026 2:57 PM IST
Cheriyal
X

Cheriyal: చేర్యాలలో ఘనంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య 5వ జిల్లా మహాసభలు!

Cheriyal: అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఐదవ జిల్లా మహాసభలు ఈరోజు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో వాసవి ఫంక్షన్ హల్ జరగాయి ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి జాతీయ ఉపాధ్యక్షులు పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్య పట్ల ASIF పోరాడుతుంది అన్నారు.

తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 12 సంవత్సరాలు పూర్తవుతున్న విద్య రంగం పట్ల విద్యార్థుల సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వాలు పూర్తి గా విఫలం అయ్యాయన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరా సంవత్సరాలు అధికారం లో ఉన్న విద్యార్థుల సమస్యల పట్ల గాని ప్రైవేట్ కాలేజీల ఫీజుల కట్టడి విషయంలో ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు.

మేము అధికారంలోకి వస్తే విద్యార్థులకు అన్ని రకాల న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూడు సంవత్సరాలు పూర్తయిన విద్యార్థుల సమస్యల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.

ఎన్నికల మేనిఫెస్టో లో విద్యార్థులకు మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా వ్యవహరిస్తుందన్నారు ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన విద్యారంగానికి సంబంధించిన సమస్యల పట్ల ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందుతున్నారు విద్యార్థుల సమస్యల పట్ల అఖిల భారత సమైక్య ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేశామని తెలిపారు.

ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్ట్మెంట్స్ పైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో.

పై చదువులకు వెళ్లడానికి కాలేజీలో సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ప్రైవేట్ కాలేజీ యజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ ASIF సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL