Komuravelli: కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏసీపీ సదానందం
Komuravelli: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ సదానందం. పెండింగ్ కేసుల పురోగతి, రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు.
Komuravelli: కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏసీపీ సదానందం
కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఏసీపీ సదానందం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును సమీక్షించారు.
స్టేషన్‌లో నిర్వహిస్తున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొంటూ, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల సీఐ రమేష్ నాయక్ SI మహేష్ .పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.




