Koheda: మోడల్ స్కూల్ మీదుగా రహదారి అలైన్‌మెంట్ మార్చాలి
Koheda: కోహెడ మండలం నాగసముద్రాల మోడల్ స్కూల్ ఆవరణను చీల్చేలా రూపొందించిన రహదారి అలైన్‌మెంట్‌ను మార్చాలని ఏబీవీపీ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.
Koheda: మోడల్ స్కూల్ మీదుగా రహదారి అలైన్‌మెంట్ మార్చాలి
కోహెడ: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణను రెండుగా విభజించేలా రూపొందించిన రహదారి అలైన్‌మెంట్‌ను మార్చాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏబీవీపీ కోహెడ మండల శాఖ ఆధ్వర్యంలో మెదక్ విభాగ్ ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్ రాజేష్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. సర్వే నంబర్ 263లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన మోడల్ స్కూల్‌లో 800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. కొందరి ప్రైవేటు భూములకు దారి కల్పించేందుకే పాఠశాల ఆవరణ మీదుగా రహదారి అలైన్‌మెంట్ రూపొందించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఈ రహదారి నిర్మాణం చేపడితే పాఠశాల స్థలం కోల్పోవడంతో పాటు విద్యార్థుల భద్రతకు, విద్యాభ్యాసానికి తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి రహదారి అలైన్‌మెంట్‌ను మార్చాలని, విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాల ఆస్తులను కాపాడాలని కోరారు. ఈ వినతిలో అజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




