Dubbak: దుబ్బాక: కారు–ట్రాక్టర్ ఢీ.. ఒకరి మృతి, నలుగురి పరిస్థితి విషమం

Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తా వద్ద కారు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 8 Oct 2026 6:02 PM IST
Dubbak
X

Dubbak: దుబ్బాక: కారు–ట్రాక్టర్ ఢీ.. ఒకరి మృతి, నలుగురి పరిస్థితి విషమం

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తా వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఇటుకలతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద తీవ్రతకు వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానికుల సహాయంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలతో పాటు క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK