Dubbaka: ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి సత్తు తిరుమల్‌రెడ్డి!
Dubbaka: దుబ్బాకలో వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్తు తిరుమల్‌రెడ్డి డిమాండ్.
Dubbaka: ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి సత్తు తిరుమల్‌రెడ్డి!
Dubbaka: వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్తు తిరుమల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో స్థానిక రైతులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తేలంగాణలో రైతుల పరిస్థితి రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోందని అన్నారు. వరి కోతలు ప్రారంభమయ్యే సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన గోదాములు, నిల్వ సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. గోదాములు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఇప్పటి నుంచే గుర్తించాలని కోరారు. రైస్ మిల్లర్ల సమ్మెతో ఇప్పటికే రైతులు ఆందోళనలో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని అన్నారు. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన కల్లాలు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.




