Vinjapalli: వింజపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!
Vinjapalli: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లిలో సర్పంచ్ అన్నాడి శ్రీజ-జీవన్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.
Vinjapalli: వింజపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!
వింజపల్లి: వింజపల్లి: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అన్నాడి శ్రీజ–జీవన్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కుటుంబ యజమాని అనుకోకుండా మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల జీవిత బీమా ఆర్థిక సహాయం అందించడం ద్వారా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజిరెడ్డి, ఉపసర్పంచ్ రంగనవేని వెంకటస్వామి, వార్డు సభ్యులు చిట్యాల కవిత–సదానందం, అన్నాడి రాజేందర్ రెడ్డి, బొదాసు తిరుపతి, అక్కరవేని సంపత్, కొమ్ముల దీప్తి–సునీల్ రెడ్డి తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




