Husnabad: ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం!
Husnabad: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం. పాల్గొన్న చైర్‌పర్సన్.
Husnabad: ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం!
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా (SHS) 2026 కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ చైర్‌పర్సన్ దండి లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్ పట్టణానికి ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రదేశమని, దేవాలయానికి వచ్చే భక్తులు దేవాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చెత్తను ఇష్టానుసారంగా బయట వేయకుండా, దేవాలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన నిర్దేశిత ప్రదేశాల్లోనే చెత్తను వేయాలని కోరారు. పరిశుభ్రమైన హుస్నాబాద్ పట్టణం కోసం పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం చైర్‌పర్సన్ , వైస్ చైర్‌పర్సన్ , కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి ఎల్లమ్మ దేవాలయ పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ , కౌన్సిలర్లు పిల్లి తిరుపతి , బొలిశెట్టి రాజు , సంపత్ , రమేష్ , శ్రీనివాస్ , వైద్యం కిరణ్ ప్రసాద్ , స్వరూప, కో-ఆప్షన్ సభ్యురాలు సరోజన , మున్సిపల్ అధికారులు SI బాల ఎల్లం, EE రవి కుమార్, జవాన్లు సారయ్య, ప్రభాకర్, శ్రీకాంత్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




