Cherial: చేర్యాలలో వింతైన చింత చెట్టు.. ఎరుపు రంగులో చింతకాయ లోపలి భాగం!

Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని కళ్యాణి ఫంక్షన్ హాల్ ఎదుట ఉన్న ఓ వింతైన చింత చెట్టుకు కాస్తున్న కాయల లోపలి భాగం ఎరుపు రంగులో ఉండి స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 27 Nov 2026 2:16 PM IST
Cherial
X

Cherial: చేర్యాలలో వింతైన చింత చెట్టు.. ఎరుపు రంగులో చింతకాయ లోపలి భాగం!

చేర్యాల: సాధారణంగా చింతకాయ లోపలి భాగం లేత గోధుమ రంగులో ఉండటం మనకు తెలిసిందే. కానీ సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఎరుపు రంగులో చింతకాయలు కాస్తున్న చెట్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చేర్యాల పట్టణ కేంద్రంలోని కళ్యాణి ఫంక్షన్ హాల్ ఎదుట ఉన్న ఈ చింత చెట్టు ప్రస్తుతం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. చెట్టుకు కాసిన చింతకాయలు బయటకు చూస్తే సాధారణ చింతకాయల మాదిరిగానే కనిపిస్తున్నప్పటికీ, వాటిని కోసి చూస్తే లోపలి భాగం పూర్తిగా ఎరుపు రంగులో దర్శనమిస్తోంది.

సాధారణంగా కనిపించే చింతకాయలకు భిన్నంగా ఇలా ఎరుపు రంగులో ఉండటం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. ఇలాంటి చింతకాయలను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని పలువురు స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చేర్యాల పట్టణంలో ఈ వింతైన చింత చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL