Cheriyal: అకాల వర్షాలతో రైతుల ఆందోళన: ఐకేపీ కొనుగోళ్లలో జాప్యం

Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాల భయంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 3 Nov 2026 6:44 PM IST
Cheriyal
X

Cheriyal: అకాల వర్షాలతో రైతుల ఆందోళన: ఐకేపీ కొనుగోళ్లలో జాప్యం

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా లోని చేర్యాల మద్దూర్ కొమురవెల్లి మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన వరి ధన్యానికి ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడం తో అన్నదాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఐకేపీ కేంద్రానికి తీసుకొచ్చి ధాన్యాన్ని ఆరబోసినట్లు రైతులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కొనుగోలు ప్రారంభించక పోవడం తో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు, పడిన శ్రమకు తగిన ఫలితం దక్కుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు.ఐకేపీ కేంద్రంలో ధాన్యాన్ని ఆరబోసి రోజులు గడుస్తున్న నిర్వాహకులు, సంబంధిత అధికారులు కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించలేదని రైతులు ఆరోపించారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL