Dubbaka: ఓటమి భయంతోనే ఓటర్ల జాబితాపై రాద్ధాంతం ఎంపీ రఘునందన్

Dubbaka: ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు ఓటర్ల జాబితాపై రాద్ధాంతం చేస్తున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శ. ఆధారాలు చూపాలని సవాల్.

Chindam Karunakar, Dubbak
Published on: 31 Oct 2026 6:32 PM IST
Dubbaka
X

Dubbaka: ఓటమి భయంతోనే ఓటర్ల జాబితాపై రాద్ధాంతం ఎంపీ రఘునందన్

దుబ్బాక: ఓటర్ల జాబితాలో నిజంగా అవకతవకలు జరిగితే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు.చనిపోయిన వారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో కొనసాగాలా అంటూ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి హాజరయ్యారు ఎంపీ.సబ్ కా వికాస్... సబ్ కా ప్రయాస్ అనే నినాదంతో దేశ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో... ప్రతిపక్ష ఇండియా కూటమి ఓటర్ల జాబితా అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి హాజరైన ఆయన... ఓటర్ల జాబితాలో ఓట్లు తొలగించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు.నిజంగానే ఓట్లు తొలగించారని భావిస్తే... సంబంధిత పోలింగ్ బూత్ ఓటర్ల జాబితాను తీసుకొచ్చి ఆధారాలతో నిరూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak