Cherial: కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారుల దందా.. రైతుల ఆవేదన!

Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారులు, దళారుల దందా కొనసాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 24 Nov 2026 3:13 PM IST
Cherial
X

Cherial: కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారుల దందా.. రైతుల ఆవేదన!

Cherial: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారుల దందా కొనసాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న దళారులు, ప్రైవేట్ వ్యాపారులు తమ ఇష్టానుసారంగా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు నెలల తరబడి ఎదురుచూస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు.

మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న వ్యవహారాలపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ వ్యాపారుల దందాకు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL