Cherial: చేర్యాల రైతు వేదికలో అధ్వానంగా టాయిలెట్లు.. రైతుల ఆవేదన!
Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల రైతు వేదికలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారి, పరిసరాలు అధ్వానంగా ఉన్నాయని నిర్వహణ లోపంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Cherial: చేర్యాల రైతు వేదికలో అధ్వానంగా టాయిలెట్లు.. రైతుల ఆవేదన!
Cherial: రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించడంతో పాటు, పంటల సాగులో మెరుగైన సూచనలు, సలహాలు అందించేందుకు గత ప్రభుత్వం రైతు వేదిక భవనాలను ఏర్పాటు చేసింది. రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాలకు వచ్చే రైతుల సౌకర్యార్థం ప్రత్యేకంగా మరుగుదొడ్లను సైతం నిర్మించారు.
కానీ ప్రస్తుతం చేర్యాల రైతు వేదిక ఆవరణలోని టాయిలెట్ల పరిస్థితి చూస్తే నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారడంతో పాటు, పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి.
రైతు వేదికల్లో జరిగే సమావేశాలకు మహిళా రైతులు సైతం హాజరవుతున్నప్పటికీ, కనీస వసతులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాలు, సౌకర్యాలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతు వేదిక ఆవరణను పరిశుభ్రం చేయడంతో పాటు, మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.




