Cheriyal: చేర్యాల మున్సిపాలిటీలో పడకేసిన పారిశుధ్యం!
Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో క్షీణిస్తున్న పారిశుధ్యం. కంపుకొడుతున్న డ్రైనేజీలు, వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు, నిరాసక్తతపై ప్రజల ఆవేదన.
Cheriyal: చేర్యాల మున్సిపాలిటీలో పడకేసిన పారిశుధ్యం!
Cheriyal: సిద్దిపేట జిల్లా లోని చేర్యాల పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఎక్కడ చూసిన పదులకొద్ది కుక్కల గుంపులు ఇంటి నుండి బైటకు వెళ్లాలంటే కోతుల బెడదా దీనికి తోడు పందుల స్వైర్య విహారం కంపు కొడుతున్న డ్రైనేజి లు అద్వానంగా మారిన అంతర్గత రోడ్లు గత రెండు నెలల నుండి ప్రధాన రహదారి ప్రక్కనే మిషన్ భగీరథ వాటర్ పైపు పగిలి రోజు కొన్ని వేల లీటర్లు వృధాగా పోతున్న పట్టించుకునే నాధుడే లేడు.
ఏ వార్డు కు వెళ్లిన ఏముంది గర్వకారనం అన్న చందనంగా రోజురోజుకి అభివృద్ధి లో దిగజారుతున్న పట్టణం అధికారుల నిర్లక్ష్యమా పాలక మండలి పట్టింపు లేకనా పేరుకే మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికీ తెలువదు పన్నులు మొపెడు పారిశుద్ధ్యం జానెడు ఎన్నికల ముందు వార్డును అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని చెప్పి గెలిచిన తరువాత ఆ నాయకులు వార్డుల్లో పర్యవేక్షణ కరువైందని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు.
ఏదైనా సమస్య ఉంటే ఎవరికీ చెప్పాలో తెలియక పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ పురపాలక సభ్యులు అధికారులు వార్డుల్లో తిరుగు సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.




