Chinnakodur: చంద్లాపూర్ వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు!

Chinnakodur: చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ ప్రభుత్వ వెటర్నరీ కళాశాల విద్యార్థినులను వేధించిన ప్రిన్సిపాల్ రాజేందర్‌పై పోక్సో కేసు నమోదైనట్లు ఎస్ఐ తెలిపారు.

RAJU, SIDDIPET
Published on: 16 Nov 2026 3:03 PM IST
Chinnakodur
X

Chinnakodur: చంద్లాపూర్ వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు!

చిన్న కోడూరు: చిన్న కోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ వెటర్నరీ కళాశాల ప్రిన్సిపల్ నుండి ఎదురవుతున్న వేధింపుల విషయం పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అధికారులకు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు ప్రిన్సిపాల్ వెళితే హాస్టల్‌లో విద్యార్ధినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, రాత్రివేళల్లో వేధింపులకు గురి చేసేవాడని, సెలవుల్లోనూ ఇంటికి వెళ్తే మొబైల్‌కు అసభ్య సందేశాలు పంపుతున్నారంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాలేజీలో తమకు ఎదురవుతున్న వేధింపులను భరించలేక విద్యార్థినిలు, తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పటంతో వారు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూనివర్సిటీ నుండి వచ్చిన కమిషన్ బృందం ఈనెల 13న కాలేజ్ లో విద్యార్థినిల నుండి రాతపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించి యూనివర్సిటీ ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిసింది.

కాగా వేధింపులకు గురిచేసిన ప్రిన్సిపాల్ రాజేందర్ పై విద్యార్థినిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET