Peddakodur: డీజే సౌండ్‌కు కూలిన ఇంటి పెచ్చులు
Peddakodur: పెద్దకోడూరులో డీజే సౌండ్ ధాటికి ఇందిరమ్మ ఇల్లు పెచ్చులు ఊడిపడి నిద్రిస్తున్న కుటుంబంలో ఐదుగురికి గాయాలు. బాధితులను కరీంనగర్ ఆస్పత్రికి తరలింపు.
Peddakodur: డీజే సౌండ్‌కు కూలిన ఇంటి పెచ్చులు
పెద్దకోడూరు: డిజె సౌండ్ కు పాత ఇందిరమ్మ బిల్డింగ్ పెచ్చులు కూలి కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని పెద్దకోడూరులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుడు కొనింటి శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.
భార్య పల్లవి, కుమారుడు మనస్తిత్, కూతుళ్లు వివేక, స్వాతిగ తన ఇంట్లో నిద్రిస్తున్నరు.దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలోని దుర్గామాత నిమజ్జన సమయంలో డీజీ సౌండ్ కు గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు పెచ్చులు కూలి నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల పై పడింది.
కుమారుడు మన స్థిత్ కూతురు వివేకకు తీవ్ర గాయాలు కాగా మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
గ్రామాల్లో దేవీ నవరాత్రుల వద్ద రాత్రింబవళ్లు డీజిల్ పెట్టడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డీజేలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రజలు కోరుతున్నారు.




