Cheriyal: ఐకేపీ కేంద్రాల్లో కానరాని ధాన్యం కొనుగోళ్లు: ఆందోళనలో రైతులు
Cheriyal: చేర్యాల పట్టణ పరిధిలోని ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో అకాల వర్షాల భయంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Cheriyal: ఐకేపీ కేంద్రాల్లో కానరాని ధాన్యం కొనుగోళ్లు: ఆందోళనలో రైతులు
చేర్యాల: చేర్యాల పట్టణ పరిధిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చి కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నా, కొనుగోళ్లకు సంబంధించి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాల భయం రైతులను వెంటాడుతోంది. ధాన్యం తడిసిపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని రైతులు కోరుతున్నారు.




