Cherial: వ్యవసాయ మార్కెట్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం!
Cherial: వ్యవసాయ మార్కెట్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించగా, ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు.
Cherial: వ్యవసాయ మార్కెట్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం!
Cherial: చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు అందించే సేవలను పరిశీలించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ లు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




