Doulthabad: దౌల్తాబాద్‌లో అభివృద్ధి పనులకు ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన

Doulthabad: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లో అభివృద్ధి పనులకు ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు. సబ్‌స్టేషన్‌‌ను తనిఖీ చేసి రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 2 Oct 2026 6:55 PM IST
Doulthabad
X

Doulthabad: దౌల్తాబాద్‌లో అభివృద్ధి పనులకు ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన

సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం దౌల్తాబాద్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ సబ్-స్టేషన్ ను ఎంపీ రఘునందన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సబ్-స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి, అధికారులతో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే రైతులకు 24 గంటల కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆస్తుల గురించి కొట్లాట పక్కన పెట్టి రైతుల కష్టాలు పట్టించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు తప్ప పాలనపై దృష్టి పెట్టడం లేదని ఘాటుగా విమర్శించారు.

బీఆర్ఎస్ నాయకులు మరోసారి అధికారంలోకి రావడం కోసం ఆరాటపడుతున్నారే తప్ప ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్షంగా పోరాడటం లేదని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak