Gajwel: సీఎం స్థాయికి తగని వ్యక్తిగత విమర్శలు: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఫైర్!

Gajwel: మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని శుక్రవారం గజ్వేల్‌లో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి డిమాండ్ చేశారు.

Osman Pathan, GAJEWL
Published on: 20 Nov 2026 9:00 PM IST
Gajwel
X

Gajwel: సీఎం స్థాయికి తగని వ్యక్తిగత విమర్శలు: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఫైర్!

గజ్వేల్: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని, మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ వి. యాదవ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకుని, రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని, క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులు నెలకొనడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతు బీమా ప్రయోజనాలను పరిమితం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. సిద్దిపేట అభివృద్ధిలో హరీష్ రావు చేసిన కృషి, ఆయన పాత్ర మరువలేనివని పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, అయితే అవి వ్యక్తిగత అంశాలకు వెళ్లకుండా పాలన, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలకే పరిమితం కావాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి హితవు పలికారు.

Osman Pathan, GAJEWL

Osman Pathan, GAJEWL