Dubbaka: దుబ్బాకలో ఘనంగా మండల స్థాయి సర్వసభ సమావేశం!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సర్వసభ సమావేశం. కరెంటు, తాగునీటి సమస్యలపై చర్చ!

KARUNAKAR,	DUBBAK
Published on: 23 Oct 2026 3:25 PM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో ఘనంగా మండల స్థాయి సర్వసభ సమావేశం!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన మండల స్థాయి సర్వ సభ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు,వారితో పాటు పలు శాఖల అధికారులు,గ్రామాల సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,మార్కెట్ కమిటీ చైర్మన్,పీఏసీఎస్ చైర్మన్,ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ప్రధాన సమస్య కరెంటు మరియు తాగునీరు గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో కరెంట్ సమస్య చాలా రోజులుగా ఉందని, దానితో పాటు రాబోయే కాలంలో నీటి సమస్య కూడా తీవ్రమయ్యే అవకాశం ఉందని, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలు సరిగ్గా పని చేసేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించాలని రైతుల నుంచి విన్నపాలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వాలు ప్రతి ఇంటికి మిషన్ భగరిథ ద్వారా నల్లాలు ఇచ్చినా, చాలా చోట్ల వాటిని సరిగ్గా బంద్ చేయడం లేదన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK