Siddipet: అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు: మంత్రి వివేక్!
Siddipet: సిద్దిపేట జిల్లా భూంపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి.
Siddipet: అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు: మంత్రి వివేక్!
Siddipet: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులందరికీ పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు.
సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండలంలోని రామలింగేశ్వర గార్డెన్లో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో సిద్దిపేట జిల్లాకు 15 వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు.




