Husnabad: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ చండీయాగం

Husnabad: హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో లోక కల్యాణం, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ 18వ చండీయాగం నిర్వహించారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 26 Oct 2026 2:08 PM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ చండీయాగం

హుస్నాబాద్: హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో లోక కల్యాణం కోసం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 18వ చండీయాగం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని మంత్రి అమ్మవారిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రతి పౌర్ణమి రోజున హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మహా చండీయాగం, ప్రతి అమావాస్య రోజున కొత్తకొండలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న మహా చండీయాగంలో హుస్నాబాద్ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD