Husnabad: హుస్నాబాద్‌లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

Husnabad: హుస్నాబాద్‌లో నిర్మాణంలో ఉన్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి, నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 10 Nov 2026 2:38 PM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్‌లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

హుస్నాబాద్‌లో: హుస్నాబాద్‌లో నిర్మాణంలో ఉన్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రస్తుతం ఆసుపత్రి భవనానికి స్లాబ్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఆసుపత్రి బేస్‌మెంట్ నిర్మాణానికి కొంత సమయం పట్టినప్పటికీ, ఇకపై చేపట్టే పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD