Akkanapet: దివ్యాంగులు, వయోవృద్ధుల సహాయ ఉపకరణాల శిబిరం ప్రారంభం!

Akkanapet: అక్కన్నపేటలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

SRINIVAS, HUSNABAD
Published on: 18 Nov 2026 1:46 PM IST
Akkanapet
X

Akkanapet: దివ్యాంగులు, వయోవృద్ధుల సహాయ ఉపకరణాల శిబిరం ప్రారంభం!

Akkanapet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో దివ్యాంగులు, వయో వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాల కొరకు అక్కన్నపేట మండల కేంద్రంలో అలింకో సంస్థ సహకారంతో నిర్ధారణ శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి వినికిడి నిర్ధారణ , వృద్ధాప్య క్యాంప్ లను, హెల్త్ క్యాంప్ పరిశీలించారు.

మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రేపు సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని,ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

అక్కన్నపేట నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్ల రహదారి మంజూరు.. టెండర్ ప్రక్రియ పూర్తయిందని త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల భూసేకరణ కోసం రూ.250 కోట్ల నిధులు కేటాయించి రైతులకు పరిహారం చెల్లించామనీ,గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసు పరిష్కారమైంది.

ఎన్జీటీలో ఉన్న కేసు కూడా త్వరలో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నానని తెలియజేశారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే గౌరవెల్లి ప్రాజెక్టు పనులను అడ్డుకోవద్దు. స్థానికంగా ఏమైనా సమస్యలుంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ కాలేజీ, 250 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పాత చెరువు అభివృద్ధి, ఇండస్ట్రియల్ పార్క్, అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. గిరిజన తండాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD