Husnabad: భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు!

Husnabad: హుస్నాబాద్ రామవరం రోడ్డులోని శ్రీ మార్కండేయ స్వామి, శ్రీ సీతారామ ఆలయంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.

SRINIVAS, HUSNABAD
Published on: 24 Nov 2026 5:43 PM IST
Husnabad
X

Husnabad: భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు!

Husnabad: పట్టణంలోని రామవరం రోడ్డు సమీపంలో గల శ్రీ శివభక్త మార్కండేయ స్వామి, శ్రీ సీతారామ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.

వ్రతంలో పాల్గొన్న భక్తులు సంప్రదాయబద్ధంగా పూజా సామగ్రిని సమకూర్చుకుని సంకల్పం చేసి గణపతి పూజ, కలశ స్థాపన, నవగ్రహ పూజల అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వ్రత కథను భక్తులకు వివరించి, హారతి సమర్పించారు. కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని భక్తులు స్వామివారిని ప్రార్థించారు.

పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సామూహికంగా వ్రతాలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఆలయ పూజారి రామక లక్ష్మణ్ అయ్యగారు వేదమంత్రోచ్ఛారణల మధ్య వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి అరుణ, పంతం కన్యాకుమారి, వడ్డేపల్లి లక్ష్మయ్య, కౌన్సిలర్ కొండ రజిత సత్యనారాయణ, బూర్ల సత్యనారాయణ, చింతకింది శ్రీనివాస్, కనకయ్య, దూడం నాగభూషణం, రాజ్‌కుమార్, చిలక రాజు, కోమటి నారాయణ, అశోక్, శ్రీనివాస్, రామకృష్ణ, ఆత్మలింగం తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD