Siddipet: రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

Siddipet: కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని కోల సత్తయ్య అనే వ్యక్తి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 5 Oct 2026 7:12 PM IST
Siddipet
X

Siddipet: రాజీవ్ రహదారిపై ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోల సత్తయ్య టీ తాగేందుకు రాజీవ్ రహదారి పక్కన ఉన్న ఓ హోటల్‌కు వచ్చాడు.

టీ తాగిన అనంతరం తిరిగి తిమ్మారెడ్డిపల్లి వెళ్లేందుకు తన బైక్‌పై రోడ్డు దాటుతుండగా సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్తయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్తయ్య మృతితో తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL