Dubbak: అన్న మృతితో తీవ్ర మనస్తాపం చెంది తమ్ముడు ఆత్మహత్య!
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో అన్న మృతిని తట్టుకోలేక తమ్ముడు మహమ్మద్ ఫారుక్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Dubbak: అన్న మృతితో తీవ్ర మనస్తాపం చెంది తమ్ముడు ఆత్మహత్య!
Dubbak: సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ మహమ్మద్ రఫీ సుమారు 15 రోజుల క్రితం ఆక్సిడెంట్ అయి మృతి చెందగా, ఆయన తమ్ముడు మహమ్మద్ ఫారుక్ (30) అన్న మృతితో ఈరోజు తీవ్ర మనస్తాపానికి గురై చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
దుబ్బాక శివారులో ఫారుక్ మృతి చెందడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో పెద్ద చీకోడ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో కొద్ది రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.




